*BITS - విద్యా సంస్థలో జాతీయ ఓటర్ల దినోత్సవం*                              పొదిలి: తేదీ 25 - 01 - 2025 న కంభాలపాడు BITS - బెల్లంకొండ విద్యాసంస్థల ప్రధాన ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విద్యాసంస్థలు అధినేతలు శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి శ్రీనివాస్ ప్రసంగిస్తూ... ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమని, ఓటు హక్కుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు.18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేయించు కావాలని... డబ్బు, మద్యం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, నీతి నిజాయితీ కల్గిన నిస్వార్ధపరులైన నాయకులు లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి గొప్ప నాయకులను ఎన్నుకొనిన ఎడల ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందన్నారు. తదనంతరం విద్యార్థులచే *భారత రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా... నిర్భయంగా స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకుంటామని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేయించారు*. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రాచార్యులు డాక్టర్ నారపుశెట్టి నాయుడు,శ్రీ తోట శ్రీనివాసులు,అధ్యాపకులు శ్రీమతి  మేహ్రూన్నీసా, శ్రీ T. దాసులయ్య, కుమారీ హమీదా,శ్రీమతి ముద్దుల లక్ష్మీకుమారి, కుమారీ ముల్లంగి ప్రణీత, దాక్షాయణి, జ్యోతి శ్రీ నేలటూరి డిబ్బారెడ్డి, శ్రీ G. భార్గవ నాయుడు, శ్రీ పఠాన్ అబ్దుల్ రహ్మాన్,SK రఫీ, శ్రీ యుద్ధం మహేష్, శ్రీ కుప్పాల నవీన్, తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

CLINI INDIA 19-07-2025