"*బెల్లంకొండ ( BITS ) " లో ఘనంగా గణతంత్ర దినోత్సవం*. పొదిలి: తేది, 26 - 01 - 2025 న ఆదివారం ఉదయం BITS బెల్లంకొండ విద్యాసంస్థల ప్రధాన ప్రాంగణం లో,76 వ రిపబ్లిక్ - డే (గణతంత్ర) దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసినారు. విద్యా సంస్థల సెక్రెటరీ & కరస్పాండెంట్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు జాతీయ జెండాకు గౌరవవందనం గావించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ప్రసంగిస్తూ... *మన దేశ రక్షణ కోసం, భద్రత కోసం చేసే చట్టాలకు స్వార్థ ప్రయోజనాలను, ప్రక్కన బెట్టీ ప్రభుత్వానికి ప్రతి పక్షాలతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు*. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సెక్రెటరీ & కరస్పాండెంట్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ప్రసంగిస్తూ...*దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జాతి, మత, కుల,వర్గ, ప్రాంతీయ విభేదాలు - విద్వేషాలు ప్రక్కన బెట్టీ భిన్నత్వంలో ఏకత్వం కల్గి ఉండటం భారత దేశ ప్రత్యేకత అన్నారు*,భారత రాజ్యాంగ స్వరూపంతో పాటు దేశభక్తి కల్గిన కవితలను వినిపించారు. బి. ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ నారపుశెట్టి నాయుడు గారు ప్రసంగిస్తూ... *ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో భారత రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగ మంటూ... చట్టాలను ప్రతి పౌరుడు గౌరవించాలన్నారు*. బి.ఎడ్. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ తోట శ్రీనివాసులు గారు ప్రసంగిస్తూ *పౌరులు హక్కుల తో పాటు భాద్యతలు కూడా గుర్తించాలన్నారు. హక్కులు భాద్యతలు రెండు కనుల వంటివన్నారు*. ప్రొఫెసర్లు,అధ్యాపకులు, విద్యార్థులు ప్రసంగించారు. విద్యార్ధుల కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.క్రీడా, పాటల సాంస్కృతిక పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీమతి మెహ్రున్నీసా, T.దాసులయ్య, శ్రీమతి మద్దుల లక్ష్మీకుమారి, కుమారీ హామీద, ముల్లంగి ప్రణీత,దాక్షాయణి,జ్యోతి, శ్రీ నెలటూరి డిబ్బారెడ్డి, శ్రీ అబ్ధుల్ రహ్మాన్,శ్రీ G.భార్గవ నాయుడు,S.K రఫీ, శ్రీ యుద్ధం మహేష్,శ్రీ కుప్పాల నవీన్ తదితరులు పాల్గొన్నారు. చివర జనగణమన జాతీయ గీతంతో గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ముగిసింది.
Popular posts from this blog
Article Publication
CLINI INDIA 19-07-2025
ONLINE MASTERCLASS on Importance of Profession Ready Training and Placements on the most booming industry, Clinical Research, Pharmacovigilance, and associated domains. Organized by *BELLAMKONDA INSTITUTE OF TECHNOLOGY AND SCIENCE*,podili, Andhra Pradesh, in association with *CLINI INDIA* Date:- 19 JULY'2025 Time:- 11-12pm







Comments
Post a Comment