PHARMACIST DAY 2024
















 *త్రేతాయుగంలో లక్ష్మణుని కొరకు సంజీవని తెచ్చిన మొట్టమొదటి ఔషద నిపుణులు (ఫార్మసిస్టు) ఆంజనేయ స్వామి* --- డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి పొదిలి: తేది 25 - 09 - 2024 BITS - బెల్లంకొండ ఫార్మసీ కాలేజీ లో *అంతర్జాతీయ ఔషధ దినోత్సవం* (ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్ డే) ఫార్మసీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొదిలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ... వైద్యుల వెనుక ఉండి వారిని ముందుకు నడిపించే అసలైన నాయకులు ఫార్మసిస్టులన్నారు. *త్రేతా యుగంలో లక్ష్మణ స్వామి కొరకు (మూర్చిల్లిన సందర్బంగా) సంజీవని తెచ్చిన మొట్టమొదటి ఫార్మసిస్ట్ - ఔషధ నిపుణుడు ఆంజనేయ స్వామియే నన్నారు.* ఫార్మసిస్టులు అయిన ఔషధ వేత్తలు మన పూర్వీకులు అందించిన జ్ఞానంతో పాటు ప్రకృతి నుండి మందులు కనుగొని యు యు టు లాగా నోబెల్ బహుమతి వైపు వైపు అడుగులు వేయాలన్నారు.ఫార్మసీ విద్యార్థులు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని తక్కువ ధరకు నాణ్యమైన డ్రగ్స్ అందించాలన్నారు. ప్రపంచమంతా ఆరోగ్యమయం చేయాలని అప్పుడే సర్వేజనా సుఖినోభవంతు సూక్తి అమలులోకి వస్తుందన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న BITS విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ప్రసంగిస్తూ... *రోగికి వైద్యం చేసి ఔషధాల ద్వారా ప్రాణం పోసేది వైద్య నిపుణులు డాక్టర్లు అయితే...ఆ ఔషధాలకు ప్రాణం పోసేది ఫార్మసిస్టులు,ఔషధ నిపుణులు అన్నారు*. రోగులకు వైద్యులకు అనుసంధానకర్తలు - తిరుగులేని వారధులు ఫార్మసిస్టులన్నారు.ప్రధాన అతిధి గా విచ్చేసిన BITS విద్యాసంస్థల MD శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ప్రసంగిస్తూ... అంతర్జాతీయ ఫార్మసిస్ట్ డే రోజున పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినోత్సవము కావడం సంతోషదాయకమన్నారు. *కొత్త కొత్త వింత వైరస్ వ్యాధులు సోకినప్పుడు నూతన ఔషధాలు కనిపెట్టి వైద్యులకు - రోగులకు అందించడంలో ఫార్మసిస్టులు, ఔషధ వేత్తలు,ఔషధ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారన్నారు*. ప్రధాన అతిధిగా పాల్గొన్న పొదిలి పట్టణం మాజీ ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ ఇమాంస గారు ప్రసంగిస్తూ... *విద్యార్థులు కృషి పట్టుదల లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్లు వెదకటం లాంటిదన్నారు*. విద్యార్థులు ఫార్మసీ వృత్తి తో పాటు 10మందికి ఉపాధి కల్పించే వ్యవస్థాపకులు తయారు కావాలన్నారు. వీరిశెట్టి విద్యాసంస్థల కరస్పాండెంట్ మరియు బిట్స్ కాలేజ్ డైరెక్టర్ శ్రీ మద్దుల శ్రీనివాసులు, బి.ఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ తోట శ్రీనివాసులు గారు ప్రసంగిస్తూ... *విద్యార్థులకు ఫార్మసీ సబ్జెక్టుతోపాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా ముఖ్యమన్నారు*. ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీమతి మెహ్రరాజ్, ఫార్మసీ విద్యార్థులు B.సుస్మిత,S.శివారెడ్డి తదితరులు ఔషధ శాస్త్ర ప్రాముఖ్యతను గూర్చి వివరించారు. ఫార్మసీ విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులందరినీ అలరించాయి.

Comments

Popular posts from this blog

CLINI INDIA 19-07-2025