International Women's Day celebrations 2025



 08/03/2025

పొదిలి కంభాలపాడు బెల్లంకొండ కాలేజీలో గా వైభవంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం 

ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థిని లు మరియు ఉపాధ్యాయులు తదితర రంగాల ప్రాముఖ్యత కలిగిన మహిళలు పాల్గొన్నారు 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ..

మహిళలు సమాజంలో సమాన హక్కులు మరియు అవకాశాలు పొందే విధానంలో చట్టాలు మాత్రమే కాకుండా సామాజిక మనస్తత్వం మార్పు అవసరం అని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు...

శ్రీ శక్తి ప్రగతి శక్తి మహిళా సాధికారత సమాజ వికాసం వంటి విధానాలు ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించాయి ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జాతికి ఒక జాగృతి దినం మహిళా సౌభాగ్యం కోసం మనం అన్ని రంగాల్లో సమగ్ర ప్రయత్నాలు చేయాలి అని సృష్టికి మూలం స్త్రీ 

మానవ రూప అపురూప శిల్పి స్త్రీ 

మానవ చరితకు సజీవ సాక్షి స్త్రీ 

పుట్టుక నుండి శిశువుగా, మగువగా, మహిళగా జీవన ప్రథాతగా. ... మహిళ ప్రస్తావన వర్ణించటం ఏ జీవిత అయినా ఏ మనిషికైనా ‌ ఎంత చెప్పినా ఒక తరం సరిపోదు 

ఆదిగా -- అనాదిగా

పాలిపటం నుండి పాలించేవరకు 

గల్లీ నుండి ఢిల్లీ వరకు 

ఆది కాలము నుండి ఆధునిక కాలం వరకు 

చదరంగంలో కూడా... "కింగ్" ను గెలిపించేది... "క్వీనే" 

కతృత్వంలో.., నేతృత్వంలో... మాతృత్వంలో... మానవ సంస్కృతికి పునాదిగా నిలిచింది

అంత చరిత్ర కలిగిన "స్త్రీ" ఈ నిసర్గ ఉన్నంతవరకు స్త్రీ స్థానం ప్రస్తావనం కొనసాగుతూ ఉంటుంది...


మానవ జీవన ప్రస్తావనలో ఒక జీవికి జననం ఆమెకే జీవన్మరణం... 

ఎక్కడికి వెళ్ళినా ఆమెకే ఆమె ప్రస్తావనం...

 చదువుకునేటప్పుడు "సరస్వతి"గా పూజిస్తాం... 

దాహమేసినప్పుడు, "గంగా మాతగా" చూస్తాం... 

 ఆకలేస్తే "అన్నపూర్ణగా" "అమ్మగా" చూస్తాం... భరతమాతగా - వ్యవసాయం చేస్తున్నప్పుడు పొలాలను "భూమాతగా" చూస్తాం...

మొక్కలను,చెట్లను సైతం "తులసమ్మగా" "లక్ష్మీదేవి" (వేప చెట్టును) గా పూజిస్తాం... మానవాళికి పాడి పంటలతో పాటు నిత్యం ఆరోగ్యాలను శుభాలను ఇచ్చి సహకరించే ఆవులను " గోమాతలు" పూజించు చున్నాము. అంతటి మహోన్నత చరిత్ర కలిగిన *స్త్రీకి* ఒక రోజు కాదు ప్రతిరోజు *స్త్రీ దినోత్సవమే*..., ప్రతిరోజు *మహిళా దినోత్సవమే* సుమా...! 1908 లో మొదలైన ఈ ప్రస్తావం ముందు పనిగంటలతో మొదలై తదుపరి ప్రపంచవ్యాప్తంగా... *అమెరికా నుండి ఆంధ్ర దాకా* మహిళా దినోత్సవం జరుపుకోవడం... ఆరాధించుకోవడం... పూజించుకోవడం... ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఆపరం పరలో... మనమందరం నిబంధనతో నిలవాలని, పురుష జాతి అంతా *స్త్రీ* కి ఎప్పుడూ... సంస్కృతికి... సంప్రదాయానికి, ధర్మానికి కృషి చేయాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో 

ఎన్ నాయుడు. T శ్రీనివాస్ రావు. మెహ్రాజ్, లక్ష్మీ కుమారి. కిరణ్మయి. స్వప్న. ప్రణీత. తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

CLINI INDIA 19-07-2025